ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం(Srikakulam) జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు.
Read Also: Varanasi: చిన్నారి ప్రాణం తీసిన దుప్పటి!

ఈ ప్రమాదం తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు(Srikakulam) కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో పడిపోయారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మూడు చేరింది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి, రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొనగా, జాతీయ రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: