అమెరికా దళాలు.. వెనిజులా రాజధాని కరాకస్‌పై శనివారం జరిపిన మెరుపు దాడిలో నికోలస్ మదురో చిక్కడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణ బస్సు డ్రైవర్ స్థాయి నుంచి దేశాధ్యక్షుడి పదవివరకు ఎదిగిన నికోలస్ మదురో (Nicolas Maduro) తో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌పై కూడా న్యూయార్క్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనిజులాపై పెంచిన ఒత్తిడి చివరకు మదురో పతనానికి దారితీసింది.
Read also: Venezuela: అమెరికా చేతిలో వెనిజులా.. 2 గంటల్లోనే ఆపరేషన్ పూర్తి
రాజకీయ ప్రస్థానం
ప్రస్తుతం అమెరికా నిర్బంధంలో ఉన్న నికోలస్ మదురో (Nicolas Maduro) .. రాజకీయ ప్రస్థానం 40 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. గత 12 ఏళ్లుగా వెనెజులా అధ్యక్షుడిగా ఉన్నారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మదురో.. 1990ల్లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి క్రమంగా ఎదిగారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో 1962లో జన్మించిన మదురో తండ్రి ఒక కార్మిక నాయకుడు. మొదట 1990ల్లో నికోలస్ మదురో.. బస్ డ్రైవర్‌గా పనిచేశారు.

సత్యసాయి బాబాని గురువుగా భావించిన మదురో
వెనిజులా అధ్యక్షుడు మదురో సత్యసాయి బాబాను గురువుగా భావించేవారని సన్నిహితులు చెబుతున్నారు. 2005లో మదురో భారత్‌కు వచ్చి పుట్టపర్తిలో(AP) సత్యసాయి బాబాను దర్శించుకున్నారు. మదురో ఆఫీసులో సత్యసాయి ఫొటో కూడా ఉండేదని సమాచారం. 2011లో బాబా మరణించినప్పుడు వెనిజులా ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అప్పట్లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: