हिन्दी | Epaper

India: అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

Saritha
India: అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

భారతదేశంలో (India) ఈ-పాస్‌పోర్ట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇది ఎలక్ట్రానిక్ పరికరం ఆధారంగా పనిచేస్తుంది, దీని బ్యాక్ కవర్ లోని చిప్‌లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ (Biometric) వివరాలు ఉంటాయి. ఈ-పాస్‌పోర్ట్ ద్వారా విమానాశ్రయాలలో స్కానింగ్, తనిఖీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. 36 పేజీల బుక్‌లెట్‌కు రూ.1,500, 60 పేజీల బుక్‌లెట్‌కు రూ.2,000 రుసుము చెల్లించాలి. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, రెన్యువల్ చేసుకునేవారు కూడా ఈ-పాస్‌పోర్ట్ పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవను త్వరలో మరిన్ని కేంద్రాలకు విస్తరించనున్నారు.

Read also: Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్

India: అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి?

ఇది కూడా సాధారణ పాస్‌పోర్ట్ లాంటిదే. అయితే, ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ ఆధారంగా పని చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ బ్యాక్ కవర్లో ఒక చిప్ ఉంటుంది. (India) ఈ చిప్ లో పాస్‌పోర్ట్ దారుడి బయోమెట్రిక్ వివరాలు.. అంటే ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నిషన్, డిజిటల్ సైన్ వంటివి ఉంటాయి. పైగా ఈ చిప్ ను ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఎయిర్ పోర్టుల్లో సాధారణంగా పాస్‌పోర్ట్ బుక్ ను పరిశీలిస్తారు. అందులో ఫొటో, సంతకం వంటివి సిబ్బంది తనిఖీ చేస్తారు.

వాటిని సరిచూసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈ-పాస్‌పోర్ట్ ద్వారా అలా స్కాన్ చేయగానే పూర్తి వివరాలు డిజిటల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. దీంతో స్కానింగ్ చేయడం సులభమవుతుంది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ-పాస్‌పోర్ట్ డాక్యుమెంట్ వెనుక భాగంలో ఒక గోల్డ్ కలర్ సింబల్ ఉంటుంది. దీని ద్వారా ఇది చిప్ ఎనేబుల్డ్ పాస్‌పోర్ట్ అని గుర్తించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870