हिन्दी | Epaper

Chiranjeevi: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది

Saritha
Chiranjeevi: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక కథతో రూపొందుతోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార, క్యాథరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read also: Ekō Ending Explained : చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

Chiranjeevi

చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్ ట్రైలర్ రిలీజ్

సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి నిర్వర్తిస్తుండగా, ఎడిటింగ్ తమ్మిరాజు, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. వీటీవీ గణేశ్, హర్షవర్ధన్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. (Chiranjeevi) ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఈరోజు తిరుపతిలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ట్రైలర్ అంతటా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి టైమింగ్ హైలైట్‌గా నిలిచాయి. చిరంజీవి తన వింటేజ్ కామెడీ అండ్ యాక్షన్ మేనరిజమ్స్‌తో అభిమానులను అలరించారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించ‌బోతున్నాడు. ట్రైల‌ర్ చివ‌రిలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం అదిరిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఫిక్స్‌

‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్‌ ఫిక్స్‌

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

జాకీ మూవీ రివ్యూ, పొట్టేళ్ల ఫైట్ డ్రామా ఎలా ఉంది?

జాకీ మూవీ రివ్యూ, పొట్టేళ్ల ఫైట్ డ్రామా ఎలా ఉంది?

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

‘డ్రాగన్’ సినిమా విడుదల వాయిదా?

📢 For Advertisement Booking: 98481 12870