ఇటీవల తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంక్రాంతికి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించాలని కేంద్రానికి లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో శనివారం జరిగిన ఒక మీడియా సమావేశంలో దీనిపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం
ఈ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, మన తెలంగాణ (Telangana) గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని ప్రయాణికులందరి సౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టిలో,

ఉంచుకుందని ఆయన వివరించారు.హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) పరిధిలోకి వస్తాయని మంత్రి గుర్తు చేశారు. అందుకే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశామని, ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సోషల్ మీడియా ప్రచారాలను తాము పట్టించుకోమని, తమ లక్ష్యం ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడమేనని తేల్చి చెప్పారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: