हिन्दी | Epaper

USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

Vanipushpa
USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ”వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది” అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్(Trump) హెచ్చరించారు. ”మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో ”జోక్యం చేసుకోవడమేనని” పేర్కొంది. ”ఇలాంటి బాధ్యాతారాహిత్యమైన మాటలు ఇరాన్ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న దౌర్జన్యపూరిత, చట్టవ్యతిరేక వైఖరికి కొనసాగింపు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ నిబంధనల మౌలిక నియమాల ఉల్లంఘన మాత్రమే కాదు. ఇరాన్ పౌరులకు వ్యతిరేకంగా హింసను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమే” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ట్రంప్ హెచ్చరికపై అంతకుముందు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు కూడా స్పందించారు. ట్రంప్ జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా అంతా అల్లకల్లోలమవుతుందని ”జాగ్రత్తగా ఉండాలని” హెచ్చరించారు.

Read Also: Sleeper bus : బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!
ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ఆగ్రహం

ఇరాన్‌లో దిగజారిన ఆర్థిక పరిస్థితులను నిరసిస్తూ దాదాపు వారం రోజులుగా జరుగుతున్న సామూహిక ఆందోళనల్లో ఎనిమిది మంది చనిపోయారు. ”శాంతియుత ఆందోళనకారులను ఇరాన్ తన అలవాటు ప్రకారం హింసాత్మకంగా కాల్చి చంపితే వారిని రక్షించడానికి అమెరికా వస్తుంది” అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ అధికారులకు వ్యతిరేకంగా వాషింగ్టన్ ఎలాంటి చర్య తీసుకుంటుందో ఆయన వెల్లడించలేదు. ఇరాన్ అణుస్థావరాలపై నిరుడు జూన్‌లో అమెరికా దాడులు చేసింది. ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడి జరిపింది.

USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
USA: మేం రెడీగా ఉన్నాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకోవాలని ఆందోళనకారుల కోరిక

”ఈ అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడం మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరిచి, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలి” అని ఆయన పోస్టు చేశారు. ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకోవాలని ఆందోళనకారుల్లో కొందరు భావిస్తున్నారు. ”ట్రంప్, లేదా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమైనా మాట్లాడితే భద్రతా బలగాలు భయపడి వణికిపోతాయి”అని తెహ్రాన్‌లో ఆందోళన చేస్తున్న ఓ యువతి బీబీసీ న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో చెప్పారు. ”ట్రంప్ ఏదైనా అన్నారంటే, అది చేస్తారని భద్రతాబలగాలు నమ్ముతాయని, ఏదైనా జరిగితే తాము పరిణామాలు ఎదుర్కోవాల్సిఉంటుంది” అని వారికి తెలుసని ఆ యువతి చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870