భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పి పూర్తిగా వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐకి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక సూచనలు చేశాడు. సిరీస్‌లను మూడు వన్డేలకే పరిమితం చేయకుండా, ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని, అలాగే ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. వన్డే క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి పెరగడానికి ఈ ఇద్దరు దిగ్గజాలే కారణమని, భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇర్ఫాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు.
Read also: ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన
అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో RO-KO
2025లో ఈ ఇద్దరు బ్యాటర్ల ఫామ్‌ను పరిశీలిస్తే ఇర్ఫాన్ సూచన ఎంతో సరైనదనిపిస్తుంది. 2025 ముగిసే సమయానికి కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నిలిచారు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ శర్మ కూడా 14 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 650 పరుగులు చేసి సత్తా చాటారు. వీరు కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టారు. ఢిల్లీ తరపున కోహ్లీ 131, 77 పరుగులు చేయగా, ముంబై తరపున రోహిత్ అజేయంగా 155 పరుగులు చేసి తన పవర్‌ను చూపించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: