हिन्दी | Epaper

Hussain Sagar: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి సాగర్‌లో దూకిన తల్లి

Tejaswini Y
Hussain Sagar: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి సాగర్‌లో దూకిన తల్లి

హుస్సేన్‌సాగర్ ఘటన.. 29 ఏళ్ల వివాహిత ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్(Hussain Sagar) వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన వసంత (29) అనే వివాహిత సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, పెద్దవాడు నందు (7), చిన్నవాడు చెర్రీ (3½) గా గుర్తించారు.

Read also: Hanamkonda Accident: లారీ కింద పడ్డ వ్యక్తి.. అక్కడికక్కడే మృతి

 Mother jumps into Sagar leaving children in chair
Hussain Sagar: Mother jumps into Sagar leaving children in chair

భర్త మృతి తర్వాత ఒంటరి జీవితం..

నాలుగేళ్ల క్రితం భర్త లక్ష్మణ్‌ కామెర్ల వ్యాధితో మృతి చెందడంతో, అప్పటి నుంచి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో ట్యాంక్‌బండ్‌(Tankbund)కు వచ్చిన వసంత, వారిని అక్కడ కుర్చీలపై కూర్చోబెట్టి సెల్‌ఫోన్ ఇచ్చి ఆడుకుంటూ ఉండమని చెప్పింది. అనంతరం ఎవరూ గమనించని సమయంలో హుస్సేన్‌సాగర్‌లోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. చిన్నారులను ఆమె సోదరుడికి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. భర్త మరణం తర్వాత ఎదురైన కుటుంబ, ఆర్థిక ఇబ్బందులే ఈ అఘాయిత్య నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870