రాష్ట్రంలో (TG) కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రహదారి భద్రతా సెస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Read also: CM Revanth: ఈ నెల 19న దావోస్‌కు సీఎం?

ఏడాదికి సుమారు రూ. 300 కోట్ల ఆదాయం!
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2,000, కారుపై రూ. 5,000, భారీ వాహనాలపై రూ. 10,000 చొప్పున సెస్సు వసూలు చేయనున్నారు. అయితే సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ సెస్సు నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే సరుకు రవాణా వాహనాలపై ప్రస్తుతం అమలులో ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేసి, దాని స్థానంలో 7.5 శాతం జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు (TG) వచ్చే పాత వాహనాలపైనా వాటి వయసును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నామని, కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: