ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) దేశ రక్షణ రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేవలం ఆరు నెలల క్రితమే నియమితులైన రక్షణ మంత్రి డెనిస్ ష్మిగల్‌ను పదవి నుంచి తొలగించి, 34 ఏళ్ల యువ నేత మిఖైలో ఫెడోరోవ్‌కు ఆ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.డ్రోన్ల తయారీలో నిష్ణాతుడైన ఫెడోరోవ్ రాకతో ఉక్రెయిన్ రక్షణ రంగం మరింత పటిష్టం అవుతుందని జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) ప్రకటించారు.
Read also: CM Revanth: ఈ నెల 19న దావోస్‌కు సీఎం?
టెక్నాలజీ వాడకంపై ఆయనకు అపారమైన పట్టు
ప్రస్తుతం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రిగా ఉన్న మిఖైలో ఫెడోరోవ్.. ఉక్రెయిన్ ప్రభుత్వంలో అత్యంత సమర్థుడైన నేతగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా రష్యాతో యుద్ధంలో డ్రోన్ల వినియోగం, టెక్నాలజీ వాడకంపై ఆయనకు అపారమైన పట్టు ఉంది. “మిఖైలోకు డ్రోన్ల తయారీ, వినియోగంపై పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడంలో ఆయన చూపిన చొరవ అద్భుతం. అందుకే రక్షణ శాఖలో కొత్త ఆవిష్కరణల కోసం ఆయనను ఎంపిక చేశాను” అని జెలెన్‌స్కీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న డెనిస్ ష్మిగల్‌ను జెలెన్‌స్కీ గత ఏడాది జూలైలోనే రక్షణ మంత్రిగా నియమించారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించడం గమనార్హం. అయితే ష్మిగల్‌ను ప్రభుత్వం నుంచి పూర్తిగా పక్కన పెట్టలేదని.. దేశ స్థిరత్వానికి అవసరమైన మరో కీలక విభాగానికి ఆయనను అధిపతిగా నియమిస్తామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: