हिन्दी | Epaper

TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

Aanusha
TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. తెలంగాణ (TG) లోని జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన శనివారం (నేడు) సందర్శించనున్నారు. అక్కడ టీటీడీ సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ (TG) జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో భేటీ కానున్నారు.

ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లతో భేటీ అవుతారు.10.30am-11.30am మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయని జనసేన పార్టీ తెలిపింది. ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేసేలా మండపాన్ని నిర్మించనున్నారు. సత్రంలో 96 విశ్రాంతి గదులు ఉండనున్నాయి.

Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

ప్రత్యేక పూజలు

మరోవైపు పవన్ కళ్యాణ్.. కొండగట్టు అంజన్నను ఇలవేల్పుగా కొలుస్తారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పడే ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి.

భక్తుల కోసం కొండగట్టులో దీక్ష విరమణ మండపంతో పాటుగా.. ఓ సత్రం అవసరం ఉందని.. వీటిని ఏర్పాటుచేయటంలో సహకరించాల్సిందిగా అధికారులు, ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

విజయ్-సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. విజేతల పూర్తి జాబితా ఇదే!

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

📢 For Advertisement Booking: 98481 12870