
భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మైదానం వెలుపల తన ప్రవర్తనతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల ఓ హోటల్ నుంచి బయటికి వస్తూ ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానిని, సెల్ఫీలు దిగాలనుకున్న వారిని నిర్లక్ష్యంగా నిరాకరించాడు.
Read also: IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?
భిన్నాభిప్రాయాలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, సుందర్ ప్రవర్తనపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు అతడిని విమర్శిస్తుండగా, మరికొందరు అతడి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు, అతడు కెమెరాల ముందు ఉండటానికి సంకోచించే స్వభావం కలవాడై ఉండవచ్చని, అందుకే అభిమానులతో మాట్లాడడం లేదా ఫొటోలు దిగడం నుంచి దూరంగా ఉన్నాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు అయితే, అతడు ఆ సమయంలో ఒత్తిడికి లోనై ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: