టాలీవుడ్ నటుడు ఆది సాయి కుమార్(Adi Sai Kumar) ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన (Shambhala Movie) ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ వారం రోజుల్లోనే రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విభిన్నమైన కథాంశం మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సెలవుల అనంతరం కూడా థియేటర్ల వద్ద సందడి తగ్గకపోవడం విశేషం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన ఈ సినిమా, రెండో వారంలోనూ మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా విజయం పట్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది.
Read also: Meera Sial: నటి మీరా సియాల్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 1980ల నాటి కథ. శంబాల అనే ఊర్లో ఓ ఉల్క పడుతుంది. (Shambhala Movie) ఆ ఉల్క పడిన నాటినుంచి ఆ ఊరిలో అన్నీ అపశకునాలు కనిపిస్తుంటాయి. దాంతో శాస్ర్తాలను, దేవుళ్లనీ, దెయ్యాలనీ అమితంగా నమ్మే ఆ ఊరి జనం ఆ ఉల్కని ‘బండ భూతం’ అని పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఉల్కని స్టడీ చేసుందుకు సైంటిస్ట్ విక్రమ్(ఆది సాయికుమార్) ఆ ఊళ్లోకి అడుగుపెడతాడు. అతను సైన్స్‌ని మాత్రమే నమ్ముతాడు. ఊరిజనాల నమ్మకాలన్నీ మూఢ నమ్మకాలని అతని ఉద్దేశ్యం. ఆ ఉల్క పడిన నాటి నుంచి ఆ ఊరివాడైన రాములు(రవివర్మ) చిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఓ ఆవుకు పాలు పిండబోతే, పాలకు బదలు రక్తం కారుతుంటుంది.
ఆ ఆవుని చంపితే కానీ ఈ ఊరికి పట్టిన అరిష్టం పోదని ఊరి జనాలు నిర్ణయించుకొని ఆ ఆవును చంపబోతుంటే విక్రమ్ అడ్డుకొని ఆ ఆవుని తనతోపాటు తీసుకెళ్తాడు. ఇక రాములు రోజురోజుకీ రాక్షసుడిలా మారుతుంటాడు. అడ్డొచ్చినవాళ్లందర్నీ చంపుకుంటూ పోతుంటాడు. ఓ దశలో విక్రమ్ మీదకు కూడా ఎగబడతాడు. తాడికి తెగబడతాడు. అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతుంది? ఆ ఉల్క వెనుక ఉన్న కథేంటి? ఆ ఊళ్లో అలాంటి భయానకమైన సంఘటనలు జరగడానికి కారణమెవరు? సైన్స్‌ని మాత్రమే నమ్మే విక్రమ్ దేవుడ్ని మొక్కాడా? లేదా? ఈ ప్రశ్నలన్నిమటికీ సమాధానమే మిగతా కథ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: