NEET student death : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఇల్మా (17) అనే విద్యార్థిని ఫాస్ట్ ఫుడ్ తిని తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం ఇల్మాకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మొదట నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందిన తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో డిసెంబర్ 22న ఢిల్లీకి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడులో 25 తిత్తులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
అయితే చికిత్సకు స్పందించని ఇల్మా డిసెంబర్ 29న మృతి చెందింది. (NEET student death) వైద్యుల వివరాల ప్రకారం, ఆమె తిన్న ఫాస్ట్ ఫుడ్లోని క్యాబేజీలో ఉన్న సూక్ష్మ పురుగులు శరీరంలోకి ప్రవేశించి మెదడులో తిత్తులుగా మారినట్లు తెలిపారు. ముఖ్యంగా పచ్చి కూరగాయలను సరిగా శుభ్రం చేయకుండా లేదా పూర్తిగా ఉడకబెట్టకుండా వండితే ఇలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: