Vande Bharat Sleeper : కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి Ashwini Vaishnaw వెల్లడించారు. ముందుగా ఈ సిరీస్లో తొలి స్లీపర్ వందే భారత్ రైలు కోల్కతా–గుహవాటి మార్గంలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ రైలును జనవరి 18 లేదా 19న ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్–అస్సాం మధ్య ప్రయాణించే ఈ రైల్లో టికెట్ ధరలు విమాన ఛార్జీలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో విమాన ప్రయాణానికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చవుతుండగా, వందే భారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.2,300గా నిర్ణయించారు. సెకండ్ ఏసీ టికెట్ ధర దాదాపు రూ.3,000 కాగా, ఫస్ట్ ఏసీ టికెట్ ధర రూ.3,600 వరకు ఉండనుందని తెలిపారు.
Read also: Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త
మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని (Vande Bharat Sleeper) ఈ ధరలు నిర్ణయించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో ఎనిమిది వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధమవుతాయని, 2026 ముగిసేలోపు మొత్తం 12 రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ రైల్లో 11 థర్డ్ ఏసీ కోచ్లు, నాలుగు సెకండ్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉండనుండగా, మొత్తం 828 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ రైలును డిజైన్ చేసినప్పటికీ, ప్రస్తుతం 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలును Narendra Modi ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: