శరీరానికి తక్షణ శక్తినిస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని(Health) అందించే వాటిలో రాగి జావకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఇది ఒక పోషకాల గనిలాంటిది. రాగి జావలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల రాగుల్లో దాదాపు 344 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా వయసు పైబడిన వారిలో కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే, 100 గ్రాముల రాగుల నుంచి 328 కిలో కేలరీల శక్తి లభించడంతో రోజంతా చురుకుగా ఉండవచ్చు. ఇందులో ఉండే ఐరన్ (3.9 mg) రక్తహీనత సమస్యను నివారిస్తుంది. (Health) ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ(Digestive system) మెరుగుపడి గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. రాగి జావ తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి, త్వరగా ఆకలి వేయదు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, చలికాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది. పాలు లేదా మజ్జిగతో కలిపి రాగి జావను రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read also: Natural Remedies: ఏం రాసినా ఓపెన్ పోర్స్ తగ్గట్లేదా? ఈ ప్యాక్స్ వేస్తే స్కిన్ మెరుస్తుంది

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: