మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న సినిమా సంక్రాంతికి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఇప్పటికే సినిమాలో చిరంజీవి లుక్ ఫిదా చేస్తోంది. విడుదలైన మూడు పాటలు మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Read also: Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా
జనవరి 4న ట్రైలర్ విడుదల
ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: