తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు ‘అనవసరంగా’ చేస్తూ, ఉద్రిక్తతలను పెంచుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అంతేకాక బీజింగ్ ను సైనికు ఒత్తిడిని నిలిపివేయాలని అమెరికా (America) చైనాను కోరింది. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక కార్యకలాపాలు రెండు దేశాలమధ్య ఉద్రిక్తతలు మరింతగా పెంచాయని, తైవాన్ పై సైనిక ఒత్తిడిని చైనా పెంచిందని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఒక ప్రకటనలో కోరారు. గతరెండు రోజులుగా చైనా బీజింగ్ క్షిపణులను తైవాన్ సమీపంలో సైనిక విన్యాసాలను చేస్తున్న సంగతి విధితమే. డజన్లకొద్దీ యుద్ధ విమానాలు, నావికాదళ నౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించింది. తైపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య తైవాన్ తన భూభాగంలో భాగమని చైనా పేర్కొంది. అంతేకాదు దీన్ని స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేస్తామని చైనా బెదిరించింది. అయితే తాము తైవాన్ శాంతి, స్థిరత్వానికి మద్దతు ఇస్తున్నటు పిగోట్ తెలిపారు.
Read also: Switzerland: రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

తానేమీ ఆందోళన చెందడం లేదు.. ట్రంప్
చైనా లైవ్-ఫైర్ డ్రిల్స్ గురించి తాను ఆందోళన చెందడం లేదని అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ‘నాకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో గొప్ప సంబంధం ఉందని, దాని గురించి నేను ఏమీ చెప్పలేనని ట్రంప్ అన్నారు. అయితే జిన్ పింగ్ ఇలా తైవాన్ సరిహద్దుల్లో ప్రయోగాలు చేస్తాడని నమ్మడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. చైనా ఆ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాలుగా నావికా విన్యాసాలు చేస్తున్నారని, ప్రజలే ఇప్పుడు భిన్నంగా చూస్తున్నారు అని ట్రంప్ అన్నారు. తైవాన్ కు అమెరికా 11బిలియన్ల డాలర్లను ఆయుధ ప్యాకేజీని ఆమోదించింది. అమెరికా ఈ నిర్ణయం తర్వాతే చైనా సైనిక విన్యాసాలకు దిగింది. దీంతో చైనా-తైవాన్ లమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: