हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావు రాజీనామా

Tejaswini Y
Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావు రాజీనామా

యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta Temple) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) వెంకట్రావు తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఆలయ వర్గాలు, అదికార యంత్రాంగం, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో యాదగిరిగుట్టపై ఆలయ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈవో వెంకట్రావు, తాను ఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read also: Vijayawada Book Festival : నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ

Yadadri Bhuvanagiri
Yadagirigutta Temple Yadagirigutta EO Venkat Rao resigns

ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు అందజేశానని కూడా ఆయన వెల్లడించారు. వెంకట్రావు (Venkat Rao) గతంలో దేవాదాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. రిటైర్మెంట్ అనంతరం కూడా ప్రభుత్వం ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా నియ మించింది. వేలాది భక్తుల రద్దీ, కోట్ల రూపాయల ఆదాయం, భారీ అభివృద్ధి ప్రాజెక్టులతో కూడిన ఆలయ పరిపాలనను ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు.

ఈవో ఆరోగ్య కారణాలనే అధికారికంగా పేర్కొన్నప్పటికీ, రాజీనామా ఇంత అకస్మాత్తుగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనుల అమలుపరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలుసిబ్బంది నియామకాలు, బదిలీలపై చర్చలు ఆలయ ఆదాయం, టెండర్లు, కాంట్రాక్టుల వ్యవహారందేవాదాయ ఒత్తిళ్లుఉన్నాయా? అన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాలపై ఇప్పటివరకు శాఖ, ప్రభుత్వ స్థాయిలో మారుతున్న విధానాలుఈ అంశాల నేపథ్యంలో అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు. ఆలయ ఉద్యోగుల్లో అనిశ్చితి. ఈవో రాజీనామా ప్రకటన అనంతరం ఆలయ ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది. కొత్త ఈవో నియామకం ఎప్పుడు? అప్పటి వరకు పరిపాలన ఎవరి చేతుల్లో ఉంటుంది? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Executive Officer Resignation, EO Venkata Rao

అభివృద్ధి పనులే అసలు పాయింట్?..

యాదగిరిగుట్ట ఆలయ పరిధిలో కొనసాగుతున్నరోడ్లుభక్తుల వసతి గృహాలుప్రసాద విభాగంపార్కింగ్, రవాణా వ్యవస్థవంటి అభివృద్ధి పనులపై ఫైళ్లు ముందుకు కదలకపోవడం, కొన్ని కీలక నిర్ణయాలపై పైనుంచి వచ్చిన సూచనలతో ఈవో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో అధికార పరిధి లేకుండా బాధ్యతలు ఎలా?” అన్న ప్రశ్నను ఆయన అధికారిక సమావేశాల్లో లేవనెత్తినట్టు తెలుస్తోంది. సిబ్బంది వ్యవహారాలపై వివాదాలు. ఇటీవలి కాలంలో కాంట్రాక్ట్ సిబ్బంది నియామకాలుభద్రతా సిబ్బంది బాధ్యతలుఆలయ ఉద్యోగుల విధుల మార్పులువిషయాల్లో అంతర్గత అసమ్మతి ఏర్పడింది. ఈ అంశాల్లో ఈవో తీసుకున్న నిర్ణయాలకు కొంతమంది వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అవి ఉన్నతస్థాయికి చేరడంతో, ఈవోపై మానసిక ఒత్తిడి పెరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ట్రస్ట్ బోర్డు నీడలో ఈవో పదవి?. . .

యాదగిరిగుట్టకు త్వరలో ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో, ఈవో పాత్ర పరిమితం అవుతుందనికీలక నిర్ణయాలు ట్రస్ట్ చేతుల్లోకి వెళ్తాయని ఈ పరిణామాలు ముందే తెలిసిన వెంక ట్రావు బాధ్యత ఉంది కానీ అధికారాలు లేవన్న భావనతోనేగౌర వప్రదంగా తప్పుకోవడమే సరైందని నిర్ణయించుకున్నారని అధికార వర్గాల అంచనా. తనపై వచ్చే ఆరోపణలకు ముందస్తు రక్షణగాలేదా ఉద్యోగుల్లో గందరగోళం రాకుండాతన వైపు నిజం చెప్పే ప్రయత్నంగాచేసిన చర్యగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాల్ పూర్తిగా ప్రభుత్వ కోర్టులో ఉంది. రాజీనామాను వెంటనే ఆమోదిస్తుందా?. లేక కొనసాగించమని కోరుతుందా? తాత్కాలిక ఈవో నియమించి కొత్త ట్రస్ట్ బోర్డు వరకు వేచిచూస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈవో రాజీనామాతోఆలయ పరిపాలన, అభివృద్ధి పనులుభక్తుల సౌకర్యాలు అన్నింటిపైనా నిశ్శబ్ద ఉత్కంఠ నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు, ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగానే కొనసాగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870