తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై మాట్లాడితేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఉద్యమ నాయకుడైన కేసీఆర్‌పై అలా మాట్లాడటం సరికాదని ఆమె (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ తప్పిదమేనని రేవంత్ రెడ్డి అన్నారని, అయితే ఇప్పటికైనా జూరాలకు మార్చవచ్చని సూచించారు.
Read also: TS UTF: కొత్త యేడాదిలోనైనా సర్వీసు నిబంధనలు రూపొందించాలి

ప్రజల్ని పిచ్చి వాళ్లను చేస్తున్నాయి
హరీష్ రావు, ప్యాకేజీలకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల్ని పిచ్చి వాళ్లను చేస్తున్నాయని విమర్శించారు. గత, సెప్టెంబర్ 3 న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా.. ఇంత వరకు తన రాజీనామాను ఆమోదించలేదన్నారు కవిత. ఎందుకు ఆమోదించలేదని అడగడానికే ఇవాళ మండలికి వచ్చినట్లు చెప్పారు కవిత.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: