స్మార్ట్ స్ట్రీట్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
నెల్లూరు : తమపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంత మంది అవాకులు, చవాకులు పేలుతున్నారని, (AP) రాష్ట్ర పురపాలక పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Ponguru Narayana) మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్లో జరిగిన న్యూ ఇయర్ సంబరాల వేడుకల్లో మంత్రి పాల్గొ న్నారు. స్మార్ట్ స్ట్రీట్ వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ఆట పాటలతో సందడి చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మంత్రి బహు మతులను అందజేశారు.
Read also: TTD: మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం

స్మార్ట్ స్ట్రీట్ న్యూ ఇయర్ వేడుకల్లో మంత్రి నారాయణ
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. (AP) స్మార్ట్ స్ట్రీట్ నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని, చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. 120 మంది మెప్మా మహిళలకు ఒక్కొక్కరికి తమ సొంత నిధి నుండి లక్ష రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. అయితే కొంత మంది అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చవాకులు చేసి మట్లాడుతున్నారని, ఏ వ్యాపారమైన నిలదొక్కునేందుకు సమయం పడుతుందన్నారు. ఆ చిన్న విషయం కూడా తెలియని కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ పట్టించు కోవాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు.
అభివృద్ధితోనే విమర్శలకు సమాధానం ఇస్తాం
స్మార్ట్ స్ట్రీట్ ని నూతన సంవత్సర శుభాకాంక్షల సక్సెస్ చేసి వాళ్ళు నోరు మూయిస్తామన్నారు. పేద పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించిన వీఆర్ హైస్కూల్ పైన కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 14 స్కూల్స్ ని వీఆర్సీ తరహాలో వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేస్తామని, విమర్శకులకు చేతలతో సమాధానం చెబుతామన్నారు. జూన్ 12 కల్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి పనులు పూర్తి చేస్తానన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం మాదేనన్నారు. వైసీపీ సద్విమర్శలు సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. వారి తీరు మారకుంటే ప్రజలే ఛీత్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: