గాంబియా(Gambia) సముద్ర తీరానికి సమీపంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. పలువురు సముద్రంలో గల్లంతైనట్లు సమాచారం.
Read Also: Israel aid ban : ఇజ్రాయెల్ ఆంక్షలతో పిల్లల ప్రాణాలు ప్రమాదంలో

నార్త్ బ్యాంక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం(Gambia) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో 96 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
బాధితుల్లో ఎక్కువ మంది ఇతర దేశాలకు చెందిన వలసదారులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: