దేశవ్యాప్తంగా 2025 సంవత్సరంలో 166 పులులు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ‘టైగర్స్ స్టేట్’గా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్‌లోనే అత్యధికంగా 55 పులులు చనిపోగా, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 పులుల మరణాలు నమోదయ్యాయి.
Read Also: Cigarette Price Hike : సిగరెట్ ధరలు పెరిగితే స్మగ్లింగ్ పెరుగుతుంది – TII హెచ్చరిక

జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (NTCA) గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు సుమారు 40 వరకు పెరిగినట్లు వెల్లడైంది. ఈ పెరుగుదల వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణవేత్తల్లో ఆందోళనను కలిగిస్తోంది.
ఈ పరిస్థితిపై వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా స్పందిస్తూ, దేశంలో(NTCA) పులుల జనాభా ఒక స్థిర స్థాయికి చేరుకుందని తెలిపారు. నివాస ప్రాంతాలు, టెర్రిటరీల పంపిణీలో సమస్యలు ఏర్పడటంతో పులుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, వాటి ఫలితంగా కొన్ని సందర్భాల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: