అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఉన్న నాసా(NASA) గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని అతిపెద్ద లైబ్రరీ రేపటి నుంచి శాశ్వతంగా మూతపడనుంది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ట్రంప్ పరిపాలన అమలు చేసిన రీఆర్గనైజేషన్ ప్రణాళిక వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Read also: SaudiArabia: సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

1959లో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక లైబ్రరీలో(NASA) లక్షకు పైగా పుస్తకాలు, పరిశోధనా డాక్యుమెంట్లు, అరుదైన శాస్త్రీయ రికార్డులు ఉన్నాయి. దశాబ్దాలుగా నాసా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు కీలక జ్ఞాన కేంద్రంగా సేవలందించిన ఈ లైబ్రరీ మూసివేత శాస్త్రీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
1,270 ఎకరాల క్యాంపస్‌లో భారీ మార్పులు
గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిధిలోని 1,270 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా 13 భవనాలు, 100కు పైగా సైన్స్ & ఇంజినీరింగ్ ల్యాబ్స్ కూడా మూతపడే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయం నాసా పరిశోధనా కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: