కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి(TTD) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని పులకించిపోయారు.
Read Also: TTD: గత దశాబ్దంలో ఎన్నడూ లేని లడ్డూ విక్రయాలు

జనవరి 8 వరకు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు జరిగిన తొలి మూడు రోజుల్లో మొత్తం 1,77,337 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ దర్శనాల్లో మొదటి మూడు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకే అవకాశం కల్పించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ ప్రవేశ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్ చేసి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఒక్క రోజులోనే 40,008 మంది భక్తులు స్వామివారి దర్శనం పూర్తిచేశారు.
ఈ-డిప్ టోకెన్లు కలిగిన భక్తుల దర్శనాలు ముగిసిన అనంతరం, టోకెన్లు లేని సాధారణ భక్తులకు (సర్వదర్శనం) కూడా వైకుంఠ ద్వార దర్శనానికి(TTD) అవకాశం కల్పించనున్నారు. అక్టోపస్ భవనం నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను పంపించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. చేపట్టిన సమర్థవంతమైన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: