తెలంగాణలో నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై(Irrigation Projects) అసెంబ్లీలో జరగనున్న చర్చను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీటి అంశాలపై సరైన అవగాహన లేకుండానే సీఎం ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారని ఆయన ఆరోపించారు.
Read also: KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్

నీటి ప్రాజెక్టులపై చర్చకు ముందు మీడియాతో KTR వ్యాఖ్యలు
రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై(Irrigation Projects) చర్చ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, భాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని సీఎం చెప్పడం ఆశ్చర్యకరమని, వాస్తవానికి అది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియదా? అంటూ ప్రశ్నించారు.
ఇలాంటి అవగాహన ఉన్న ముఖ్యమంత్రితో నీటి అంశాలపై చర్చ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: