అమెరికా(America) నుంచి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి జరగనుందన్న సమాచారం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో మొక్కజొన్న సాగుకు పంది ఎరువును వినియోగిస్తారన్న ఆరోపణలు ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున వివాదాన్ని రేపుతున్నాయి.
Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

అమెరికా రాయబార కార్యాలయ పోస్ట్‌తో రాజుకున్న వివాదం
డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. ఆ పోస్ట్ అనంతరం నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, అమెరికా తన మిగులు వ్యవసాయ ఉత్పత్తులను బంగ్లాదేశ్‌పై బలవంతంగా రుద్దుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ చర్య అక్కడి ప్రజల మత విశ్వాసాలకు విరుద్ధమని, ఇస్లామిక్ ఆచారాలను దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా చేపల మేతలో పంది మాంసానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు తేలడంతో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘మీట్ అండ్ బోన్ మీల్’ పౌడర్‌పై నిషేధం విధించిన విషయం గుర్తుచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా మొక్కజొన్న దిగుమతులపై(America) మరింత జాగ్రత్త అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలపై ఇప్పటివరకు అమెరికా రాయబార కార్యాలయం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: