ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్క్–లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం విస్తృతంగా చర్చకు వస్తోంది. ఉద్యోగ ఒత్తిడి పెరుగుతున్న ఈ కాలంలో, వ్యక్తిగత జీవితం–వృత్తి జీవితం మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్న ప్రశ్న అనేక మందిని ఆలోచింపజేస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ రంగం నుంచి ప్రభుత్వ విభాగాల వరకు, పని గంటలు, మానసిక ఒత్తిడి, కుటుంబానికి కేటాయించే సమయం వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా మారాయి.
Read also: Sanjeev Kapoor: ఇన్స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO
సంగీతం వినడం, పుస్తకాలు చదవడం
ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్… తనకు మిగతా ఉద్యోగుల్లా వారాంతపు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు షెడ్యూల్ వేసుకుని పనిచేయడం తన వృత్తిలో సాధ్యం కాదన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలకు టైమ్ టేబుల్ ఉండదని,
ప్రపంచంలోని దేశాలు వేర్వేరు టైమ్ జోన్లలో ఉండటంతో ఎప్పుడైనా పని చేయాల్సి వస్తుందని వివరించారు. తన రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను పాటిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నానన్నారు. విశ్రాంతి కోసం సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, క్రీడల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం వంటి అలవాట్లు తనకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.

డిటాక్స్ కావాల్సిన అవసరం లేదు
ఈ అలవాట్ల వల్ల ప్రపంచంతో అనుసంధానమై ఉండగలుగుతున్నానని, అదే తనకు వర్క్ – లైఫ్ బ్యాలెన్స్‌ను ఇస్తోందని తెలిపారు. ప్రత్యేకంగా బ్రేక్ తీసుకోవడం లేదా డిటాక్స్ కావాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్న జైశంకర్ (S Jaishankar)… ఈ విధానంతో తన జీవితం సహజంగానే కొనసాగుతోందన్నారు.
అయితే ఈ అభిప్రాయాలు ఇంట్లో అందరికీ నచ్చవని నవ్వుతూ చెప్పారు. తన భార్య కూడా ఇక్కడే ఉన్నారని, ఈ విషయంపై ఆమె తనతో విభేదించే అవకాశం ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చకు దారి తీశాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: