ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి చివరికి రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిధులు పెంచకుండా చేసి ఇప్పుడు ఆ పథకాన్నే రద్దుచేసే విధానాలు అమలు చేస్తున్నది. అందు లో భాగమే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకా నికి వికసిత్ భారత్ జీరామ్జీ (గ్యారంటీ ఫర్రోజ్దార్ అండ్ఆ జీవక్మిషన్గామన్) గా పేరుపెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును 16.12.25 పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఎటువంటి చర్చలేకుండానే నిరసనల మధ్య 18.12.25న బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్టంగా ఆమోదింప చేసింది. ఈ బిల్లులో పంచాయతీల ద్వారా పనులు అమలు, పనిదినాలను 100 నుచి 125 రోజులకు పెంపు, వ్యవసాయ సీజన్లో కూలీల కొరతలేకుండా ఉపాధి పనులను 60 రోజుల వరకు తాత్కా లిక నిలిపివేత, వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాకాల స్థాయిలో పనులు, ప్రణాళికలు, వారానికి ఒకసారి కూలి చెల్లింపు, ఏబీసీలు గ్రామపంచాయతీల విభ జన, కేంద్ర నిర్ధారించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి పనుల కేటాయింపు, కేటాయింపులకు అద నంగా నిధులు ఖర్చుచేస్తే దాన్ని రాష్ట్రాలే భరించడం, ఉపాధి పనుల కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిధుల కేటా యింపు ఈ బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
Read Also: http://2025 : 2025లో సంతృప్తినిచ్చిన జ్ఞాపకాలు ఇవే అంటూ లోకేశ్ ట్వీట్

గ్రామీణ పేదల్లో వ్యతిరేకత
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గి, నిరుద్యోగం పెరగడం, ఉపాధికోసం గ్రామీణ పేదలుపట్టణాలకు వలస బాటపట్టటం, ప్రభుత్వం వెడల గ్రామీణ పేదల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం దృష్టిలో పెట్టుకుని, ఆ వ్యతిరేకతను చల్లార్చేందుకు యూపీఏ ప్రభు త్వం గ్రామీణ ఉపాధిహామీ పథకం (Employment Guarantee Scheme) తేవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నికరమైన ఆదాయ కల్పన, వనరుల ఉత్పాదక, అభివృద్ధి లక్ష్యాలుగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యంగా ప్రకటించింది. 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథ కంగా యూపీఏ ప్రభుత్వం పథకం పేరు మార్చింది. ఈ పథకం కింద జాబ్కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 100 రోజులపని కల్పిస్తామని చెప్పింది. 2024 నాటికి దేశంలో జాబ్కార్డులు పొందిన కుటుంబాలు 9 కోట్ల, 2 లక్షలుగా ఉన్నాయి. ఉపాధి పథకం (Employment Guarantee Scheme) ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుటుంబాలకు వందరోజుల పని కల్పించడం లో పాలక ప్రభుత్వాలన్నీ విఫలం అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 40.70 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని లభిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.74 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని లభించింది. యూపీఏ ప్రభుత్వ పాలనలోనే పథకాన్ని నీరుగార్చే విధానాలు ప్రారంభమై నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో అది తీవ్రమైంది. అందుకు అనుగుణంగానే పథకా నికి నిధులు కేటాయింపులు తగ్గించడం లేదా పెంచకపోవ డం జరిగింది. 4కోట్ల, 57లక్షల జాబ్ కార్డులు తొలగించారు.
తొలగించబడిన జాబ్ కార్డులు
2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 జాబ్కార్డులు తొలగించి 100 రోజులు పని కల్పించడంలో విఫలమైంది. ఈ విషయాన్ని కేంద్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ 9.12.2025న పార్లమెంట్కు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 లక్షల జాబ్ కార్డులు తొలగించింది. 2019-20, 2024-25 మధ్య అత్యధికంగా తొలగించబడిన జాబ్ కార్డుల సంఖ్య కోటి, 4 వేలమంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11మంది జాబ్కార్డులు తొలగించబడ్డాయి.తెలంగాణలో 3,45,445, ఒడిశాలో 80,896, ఉత్తరప్రదేశ్లో 91.48 లక్షలు | జాబ్కార్డులు తొలగించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్ నిధుల కేటాయింపులు పెంచడంలేదు. 2020-21 వార్షిక బడ్జెట్లో 63 వేలు కేటాయించిన తర్వాత కోవిడ్ రావడంలో పట్టణాలకు వలసవెళ్లిన ప్రజలందరూ తిరిగి గ్రామాలకు రావడంలో వారికి ఉపాధి సమస్యగా మారడం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో, గ్రామీణజాతీయ ఉపాధి పథకానికి 63వేల కోట్ల నుంచి 1,11,170 కోట్లకు నిధులు కేటాయింపు జరిగింది. ఆమరుసటి ఆర్థిక(2022- 23) సంవత్సరం బడ్జెట్ కేటాయింపు మాత్రం 73 వేల కోట్లకే పరిమితమైంది. 2024-25 బడ్జెట్లో 60వేలకోట్లు కేటాయించి, ఆ తర్వాత 86 కోట్లుగా ప్రకటించింది. 2025 – 26వార్షికబడ్జెట్లో 89,153.73 కోట్లు ప్రకటించింది. గత బడ్జెట్ కన్నా పెంపుదల 3వేలు మాత్రమే. దీన్ని పెంపుదల అనలేం.

నోటిపై చేసిన ప్రాంతాల్లో మాత్రమే
కోవిడ్ సమయంలో తప్ప ఉపాధి పథకానికి నిధుల పెంపుదల జరగలేదు.వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ 5(1) ప్రకారం కేంద్ర ప్రభు త్వం ఏ ప్రాంతాలను నోటిఫై చేస్తుందో, అక్కడ మాత్రమే ఈ పథకం అమలు జరుగుతుంది. కేంద్రం నోటిపై చేసిన ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యంలేని పనిచేయడానికి ముందు కు వచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారంటీ పనిని రాష్ట్రప్రభుత్వ కల్పిస్తుంది. నోటిఫై చేయని ప్రాంతాల్లో పేద కుటుంబాలకు కొత్తపథకంలో పని లభించదు. కొత్త పథకంలోని సెక్షన్ 5(1) రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. ఇంతకు ముందు ఉపాధి చట్టంలో పనులు ఏప్రాంతాల్లో నిర్ణయించాలన్నది రాష్ట్రప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు కొత్త ఉపాధి పథకం రాష్ట్రాల హక్కును తొలగించి, కేంద్ర ప్రభు త్వానికి కట్టబెట్టింది. కేంద్రప్రభుత్వం, తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో పనులకేటాయింపులలో వివక్షకు అవకాశం ఉంది. ఉపాధి వేతనాల్లో ఖర్చులో కూడా గతంలో ఉన్న కేంద్రం 90 శాతం, రాష్ట్రాల 10శాతం నిధులను 60:40 నిష్పత్తిలో పంచుకోవాలి. ఇది రాష్ట్రాలపైభారం మోపడమే. ఈ భారాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలు భరించలేక ఉపాధి పనులను గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా జాబ్ కార్డు పొందిన కుటుంబాలకు పని లభించదు.
పేరుకుపోతున్నాఉపాధి బకాయిలు
ఉపాధి హామీ పథకంలో రోజు కూలీ 307 రూపాయలుగా కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. వాస్తవ రూపంలో రూ.240లకు మించి రావడం లేదు. వ్యవసాయ, వ్యవసాయేతర పనుల్లోనూ రోజు కూలిరూ.500గా ఉంది. దీన్ని గమనిస్తే ఉపాధి పథకం కూలి ఎంత తక్కువగా ఉందో తెలుస్తుంది. వ్యవసాయ సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనులు ఉండవని తాజా బిల్లులో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం వల్ల గ్రామీణ పేదలకు లభించే ఉపాధిలో 80శాతం తగ్గిపోయింది. గ్రామీణ ఉపాధి పనులే వారికి ఆధారం.వ్యవసాయ సీజన్ పేరుతో ఉపాధి పథకం పనులు నిలిపివేస్తే పేదకుటుంబాలు పనులు దొరక్క తీవ్ర సంక్షోభంలో పడతాయి. ఉపాధి పనుల కూలీ లకు వారం రోడుల్లోనే వేతనాలు చెల్లించాల్సి ఉండగా, నెలల తరబడి వారికి కూలిడబ్బులు అందకపోగా ఉపాధి బకాయి లు మాత్రం పేరుకుపోతున్నాయి. ఉపాధి పనులకు చెల్లిం చాల్సిన బకాయిల మొత్తం దేశవ్యాప్తంగా 1,340కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 402.93 కోట్ల బకాయిలు ఉన్నాయి. కేరళలో 339.87కోట్లు, తమి ళనాడులో 220.13కోట్లు, మధ్యప్రదేశ్ 131 కోట్లు బకామలున్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథక లక్ష్యం అనుగుణంగా పనిచేయకపోయినా, అవకతవకలు, అవినీతితో నిండిఉన్నా గ్రామీణ, ఆదివాసీ ప్రజలకు పథకం కొంతమేరకు ఉపశమనంగా ఉంది. దీన్ని కూడా వారికి లేకుండా చేసేందుకే కేంద్ర నాయకత్వాన ఉన్న ఎన్టీయే ప్రభుత్వం తెచ్చిన కొత్తగ్రామీణ ఉపాధి చట్టం. ఉపాధి పొందడం ప్రజల హక్కు. అది భిక్షకాదు.
-బొల్లిముంత సాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: