हिन्दी | Epaper

America: పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు

Pooja
America: పుతిన్ పై ఉక్రెయిన్ దాడికి ఆధారాలు లేవు

గత మూడురోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసం సమీపంలో డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని, ఆ దేశంపై ఆరోపణలు చేశారు. దీన్ని ఉక్రెయిన్ దేశం ఖండించినా రష్యామాత్రం దీన్ని నమ్మలేదు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా ఉక్రెయిన్, పుతిన్ ను హత్య చేయడానికి ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్పష్టం చేసింది. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది. అయితే రష్యా అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నం చేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీఐఏ తేల్చి చెప్పింది.

Read Also: Bangladesh: యూనస్ పాలనపై హసీనా తీవ్ర వ్యాఖ్యలు

America

పుతిన్ వ్యక్తిగత నివాసం ఉన్న ప్రాంతంలోని సైనిక లక్ష్యాలపై దాడి చేయాలని ఉక్రెయిన్ యోచిస్తోందని, అయితే ఆయన ఇంటికి అత్యంత సమీపంలో సైనిక స్థావరాలు ఏవీ లేవని ఒక అమెరికా(America) అధికారి వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. నోవ్ గోరొడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా క్రెమ్లిన్ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను అన్నింటినీ నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని రష్యా పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక వీడియో దృశ్యాలను కూడా విడుదల చేసింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(America) కూడా ఖండించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870