ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) బిజ్నోర్ జిల్లాలో హృదయాలను గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన వ్యక్తి అకస్మాత్తుగా ఓ యువతిని పట్టుకుని, ఆమె గొంతుపై కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. అక్కడ ఉన్నవారంతా భయంతో కదలలేని పరిస్థితి నెలకొంది. నిందితుడు కొన్ని డిమాండ్లు చేస్తూ దుకాణంలో ఉన్నవారిని తీవ్ర ఉత్కంఠకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Read also: Ammonium Nitrate: రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
Uttar Pradesh Crime
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. షాపింగ్ కాంప్లెక్స్‌లోకి చాకచక్యంగా ప్రవేశించి, ఎలాంటి హాని జరగకుండా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని అజిత్ బాల్ గోవింద్‌గా గుర్తించారు. యువతిని సురక్షితంగా రక్షించడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మరోసారి ప్రజా ప్రదేశాల్లో భద్రత ఎంత కీలకమో గుర్తు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: