ఉగ్రవాదంపై పాకిస్థాన్(Pakistan) ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇటీవల విడుదలైన ఒక వీడియో ఉగ్రవాదులు, పాక్ మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టింది. ముఖ్యంగా లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థతో దాని సంబంధాలను, కపట నాటకాలను ఈ వీడియో గుట్టురట్టుచేసింది. హఫీజ్ సయ్యద్ మద్దతు ఉన్న పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మక్కీ ఉన్నారు. లాహోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న శక్తులు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం లేదనే పాక్ వాదనలు తుడిచిపెట్టేశారు. ‘ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఎలా వేదికను అందిస్తుందో ఇది బట్టబయలు చేస్తుంది’ అని భద్రతా దళాల సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
Read Also: Huge Explosion : నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ పేలుడు

50 ఏళ్ల వరకు భారత్ తమపై దాడి చేయలేదు
సమావేశంలో భారతదేశంపై మరోసారి బెదిరింపులకు దిగాడు. లైవ్ వీడియోలో భారత్ మరో 50 ఏళ్లు పాకిస్థాన్‌ను సవాలు చేయడానికి ధైర్యం చేయదని కసూరి ప్రగల్భాలు పలికాడు.భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు. మొత్తం మూడు గంటల ఈ వీడియోలో ఓ సమావేశంలో జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ‘భారత్ విషయంలో తమకు ఎలాంటి భయం లేదని, వచ్చే 50 ఏళ్ల వరకు భారత్ తమపై దాడి చేయలేదు’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఒక రిక్రూట్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలు భారత్ ను తక్కువ అంచనా వేయడంలో లష్కర్ ధైర్యాన్ని, తీవ్రవాద కార్యకలాపాలలో ఇస్లామాబాద్ లోతైన పాత్రను తెలియజేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వీడియో పాకిస్థాన్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందనడానికి తిరుగులేని సాక్ష్యమని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: