బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించిన (Dhurandhar movie) ఈ సినిమాను, కొన్ని కీలక మార్పులతో ఇవాళ థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు చిత్రంలో వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న ‘బలోచ్’ అనే పదాన్ని మ్యూట్ చేసినట్లు సమాచారం.
Read also: PM SHRI scheme: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్రం ఆదేశాలతో ‘బలోచ్’ పదం మ్యూట్
ఈ చిత్రంలో కొన్ని పదాలను, డైలాగులను తొలగించాలని కేంద్రం చిత్ర బృందానికి సూచించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు నిన్న (డిసెంబర్ 31) దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ యాజమాన్యాలకు ఈ-మెయిల్స్ పంపారు. (Dhurandhar movie) పాత ప్రింట్ స్థానంలో మార్పులు చేసిన కొత్త డిజిటల్ సినిమా ప్యాకేజీని (DCP) డౌన్‌లోడ్ చేసుకుని, జనవరి 1 నుంచి ప్రదర్శించాలని కోరారు. ఇందులో రెండు పదాలను మ్యూట్ చేయగా ఒక డైలాగ్‌ను మార్చారు. మ్యూట్ చేసిన పదాల్లో ఒకటి పాకిస్థాన్‌కు సంబంధించిన ‘బలోచ్’ కాగా రెండో పదం మార్చిన డైలాగ్ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం పాకిస్థాన్ సామాజిక ఘర్షణలు ఉగ్రవాదానికి ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం నటించింది. ఈ కథ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత గాథ అని సెన్సార్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. రాజకీయ, సామాజిక సున్నితత్వం దృష్ట్యా కేంద్రం ఈ తాజా మార్పులను సూచించినట్లు తెలుస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: