New Year 2026 : న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2026కు ఘనంగా వెల్‌కమ్ చెప్పింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవ వాతావరణం నెలకొనగా, ముఖ్యంగా ఆక్లాండ్‌లో భారీ స్థాయిలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
దేశంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన స్కై టవర్ వేదికగా అద్భుతమైన బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు. రంగురంగుల కాంతులతో ఆకాశం మెరిసిపోయింది. వేలాది మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.
Read also: Court Verdict: కుల్దీప్ సెంగార్ విడుదలపై సుప్రీంకోర్టు స్టే రద్దు
న్యూజిలాండ్ తర్వాత కొద్దిసేపటికే ఆస్ట్రేలియాలో కూడా న్యూఇయర్ వేడుకలు (New Year 2026 ) ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద ఘనంగా బాణసంచా పేల్చారు. ఇటీవల జరిగిన ఉగ్ర ఘటనల నేపథ్యంలో అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక ఉత్తర కొరియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, తైవాన్, మంగోలియా వంటి దేశాల్లో కూడా క్రమంగా నూతన సంవత్సర సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే తొలిసారిగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే ప్రాంతంగా పసిఫిక్ మహా సముద్రంలోని కిరిటిమాటి దీవి నిలిచింది. ఆ తర్వాతే న్యూజిలాండ్‌లో న్యూఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: