Stranger Things 5 Finale : స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ప్రేక్షకుల్లో కొత్త సందేహాలను రేపింది. ముఖ్యంగా ఎలెవెన్ నిజంగానే బతికే ఉందా? లేక అది మైక్ వీలర్ ఊహ మాత్రమేనా? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది.
సీజన్ 5 చివరి ఎపిసోడ్ మొత్తం చూసినవారికి తెలుసు.. వెక్నాను ఓడించేందుకు ఎలెవెన్ తన ప్రాణాలను పణంగా పెట్టి త్యాగం చేసింది. ఆ కీలక మిషన్ సమయంలో కాలీకి హాకిన్స్ ల్యాబ్ సైనికుడు కాల్చాడు. ఆ ఘటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
వెక్నా ఓటమి తర్వాత అందరూ (Stranger Things 5 Finale) రియల్ వరల్డ్‌కి తిరిగివచ్చారు. అప్పుడు డాక్టర్ కే బృందం అక్కడికి చేరుకుని ఎలెవెన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే వారిని తప్పించుకుని, అప్‌సైడ్ డౌన్ గేట్ దగ్గర ఎలెవెన్ నిలబడిన సీన్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది.
ఈ నేపథ్యంలో ఎలెవెన్ నిజంగా బతికిందా? లేక ఆమె త్యాగం అంతిమమా? అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా రాలేదు. తాజాగా డఫర్ బ్రదర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ మిస్టరీపై మరింత చర్చకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: