Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ హీరో Vijay Deverakonda మరియు నేషనల్ క్రష్ Rashmika Mandanna కలిసి రోమ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల రష్మిక తన Rome వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేయగా… కొద్ది రోజులకే విజయ్ దేవరకొండ కూడా రోమ్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆయన షేర్ చేసిన ఫొటోల్లో, ప్రసిద్ధ Colosseum ముందు నిల్చున్న విజయం అభిమానులను ఆకట్టుకుంది. మరో ఫొటోలో విజయ్ భుజంపై ఓ మహిళ తల ఆనించుకున్నట్లు కనిపించగా… ఆమె ముఖం కనిపించకపోయినా, అభిమానులు అది రష్మికే అని భావిస్తున్నారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
ఇదే సమయంలో, రష్మిక షేర్ చేసిన వెకేషన్ కంటెంట్‌లో కూడా (Vijay Deverakonda) కొన్ని సబ్‌టిల్ మోమెంట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఒక వీడియోలో రష్మిక ముందుగా విజయ్‌కు డెజర్ట్ తినిపించి, ఆ తర్వాత తానే రుచి చూసిన క్లిప్ వైరల్‌గా మారింది. ఈ చిన్న క్షణాలే ఇద్దరూ కలిసి వెకేషన్‌లో ఉన్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 2025లో విజయ్–రష్మిక గుట్టుగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు వారు అధికారికంగా స్పందించలేదు. తాజాగా వచ్చిన కథనాల ప్రకారం, 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ రాజభవనంలో వీరి వివాహం జరగనుందని టాక్. ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతుందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: