హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Numaish2026) గురువారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుమాయిష్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంయుక్తంగా ప్రారంభించనున్నారు.
Read Also: Telangana: డిసెంబర్ 31న భారీగా మద్యం అమ్మకాలు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. గృహోపకరణాలు, వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, ఆట వస్తువులు, ఆధునిక సాంకేతిక ఉత్పత్తులు వంటి విభిన్న విభాగాల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
ఈ ప్రదర్శన సుమారు 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 15తో ముగియనుంది. ప్రవేశ రుసుమును రూ.50గా నిర్ణయించగా, ఐదేళ్లలోపు(Numaish2026) చిన్నారులకు పూర్తిగా ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కుటుంబ సమేతంగా వచ్చేవారికి అనుకూలంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నుమాయిష్ కొనసాగుతుంది. వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల వరకు ప్రదర్శనను కొనసాగించనున్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: