కర్నూలు(Kurnool) జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామం(Buduru village)లో చికెన్ విక్రయ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చికెన్ కొనుగోలు విషయంలో ముందస్తు క్రమంపై జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి కత్తిపోట్లకు దారి తీసింది.
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

ముగ్గురు వ్యక్తులపై దాడి
ఈ సంఘటనలో నరేష్ అనే యువకుడు ఆగ్రహంతో కత్తిని దించి విజయ్, చిన్న, గాబ్రేలు అనే ముగ్గురు వ్యక్తులపై దాడి(attack) చేసినట్లు సమాచారం. దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా, వారిలో విజయ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అతన్ని తక్షణమే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నరేష్‌పై కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా నరేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: