రూ.50 పందెం కోసం ఓ విద్యార్థి (student) చేసిన పని అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు పెన్ను మింగేయగా అది మూడేళ్లపాటు కడుపులోనే ఉండిపోయింది. తాజాగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో గుంటూరు (Guntur) ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు అత్యాధునిక విధానంలో పెన్నును వెలికితీసి ప్రాణాపాయం తప్పించారు.
Read also: District Reorganization: అతిపెద్ద జిల్లాగా కడప అగ్రస్థానం

అసలేం విషయం ఏమిటంటే..!
గుంటూరులోని కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాత దంపతుల కుమారుడు మురళీకృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. (Guntur) మూడేళ్ల క్రితం అంటే తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో స్నేహితులతో సరదాగా రూ.50 పందెం కాసి ఓ పెన్నును మింగేశాడు. అప్పట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు.
అయితే గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తున్నా మందులతో సరిపెట్టుకున్నాడు. కానీ, డిసెంబరు 18న నొప్పి భరించలేనంతగా మారడంతో స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు మురళీకృష్ణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సీటీ స్కాన్ తీయగా పెద్దపేగులో పెన్ను ఇరుక్కున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎలాంటి కోత లేకుండా ‘రెట్రో గ్రేడ్ ఎంటెరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్’ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగించి పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. మూడేళ్ల పాటు కడుపులో ఉన్న పెన్ను బయటకు రావడంతో విద్యార్థి కోలుకుంటున్నాడు. క్లిష్టమైన ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: