నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణ పోలీసు శాఖకు చెందిన 630 మంది సిబ్బందికి ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. పోలీసు విభాగంలో అత్యున్నత గౌరవంగా భావించే ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మహేష్ కుమార్ లఖాని ఎంపికయ్యారు.
Read Also: NewYear2026 :నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఈ గౌరవానికి అనుగుణంగా ఆయనకు రూ.5 లక్షల నగదు బహుమతిని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర పోలీసు అధికారులకు మొత్తం 7 శౌర్య పతకాలు, 53 కఠిన సేవా పతకాలు, 16 మహోన్నత సేవా పతకాలు, 94 ఉత్తమ సేవా పతకాలు, 459 సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: