కొత్త సంవత్సరం 2026 ఆరంభంలోనే గ్యాస్ వినియోగదారులకు, బ్యాడ్ న్యూస్. చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. జనవరి 1వ తేదీన విడుదలైన కొత్త ధరల ప్రకారం, 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ. 111 పెరిగింది. పండుగ వేళ వ్యాపారస్తులకు ఈ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చింది.ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా ధరలు దాదాపు ₹1,850కి చేరుకున్నాయి. ఇంతలో, దేశీయ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.
Read Also: New Year 2026: ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
IOCL డేటా ప్రకారం, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. నవంబర్ 2023 తర్వాత రూ. 100 కంటే ఎక్కువ పెరగడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2023 తర్వాత వాణిజ్య (LPG)గ్యాస్ సిలిండర్ ధరల్లో ఇదే అతిపెద్ద పెరుగుదల. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 111 పెరిగాయి. దీనితో పాటు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ. 1,691.50, రూ. 1,795, రూ. 1,642.50కి చేరుకుంది. చెన్నైలో, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 110 పెరిగి రూ. 1,849.50కి చేరుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: