రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్ (Spirit Movie) అనే భారీ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక కాపీ డ్రామా. ఇందులో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ‘స్పిరిట్ – వన్ బ్యాడ్ హ్యాబిట్’ (Spirit Movie) ప్రోమో ఆకట్టుకుంది. 2026 న్యూ ఇయర కానుకగా తాజాగా ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.
Read Also: Anaganaga OkaRaju:సంక్రాంతి బ్యూటీగా మారిన మీనాక్షి చౌదరి

ప్రభాస్ లుక్ అదిరిపోయింది
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్ షేర్ చేస్తూ.. “భారతీయ సినిమా.. మీ అజానబాహుడిని (AJANUBAHU) వీక్షించండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చొని ఉండగా, హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నారు. గతంలోని గాయాలను గుర్తుచేసేలా ఉన్న ఈ పోస్టర్ లో.. ప్రభాస్ డార్క్ గ్లాసెస్, ఆఫ్ వైట్ ప్యాంట్‌తో మాస్ లుక్‌లో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: