జనవరి 1 నుంచి, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, చిల్లర్లు, డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు మరియు గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఇన్వర్టర్లపై ఇంధన సామర్థ్యాన్ని(Energy Efficiency) చూపే స్టార్ లేబుల్స్ తప్పనిసరిగా ఉండనివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఈ విధానం కోసం గెజిట్(Energy Efficiency) నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఈ లేబులింగ్ కొన్ని ఉత్పత్తుల కోసం స్వచ్ఛందంగా మాత్రమే ఉండేది. అధికార వర్గాలు, ఈ జాబితాను భవిష్యత్తులో సమయానుకూలంగా అప్‌డేట్ చేస్తామని కూడా తెలిపారు. స్టార్ లేబుల్స్ వినియోగదారులకు ఉత్పత్తుల ఇంధన సామర్థ్యాన్ని సులభంగా గుర్తించడానికి, విద్యుత్ మరియు ఇంధన ఖర్చులను తగ్గించడంలో సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: