భారత రక్షణ రంగం మరో కీలక దశను అధిగమించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ను(Pralay Missile) బుధవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి స్వల్ప వ్యవధిలో రెండు క్షిపణులను ప్రయోగించే సాల్వో లాంచ్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించారు.
Read Also: Jairam Ramesh: భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగించిన క్షిపణులు ముందుగా నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి, లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించాయని రక్షణ శాఖ వెల్లడించింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఏర్పాటు చేసిన ఆధునిక ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పూర్తిగా పరిశీలించారు. ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు.
‘ప్రళయ్’(Pralay Missile) క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ-బాలిస్టిక్ మిసైల్ ఆధునిక నావిగేషన్, గైడెన్స్ సిస్టమ్స్‌తో పనిచేస్తుంది. వివిధ రకాల వార్హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), పలు డీఆర్డీవో ప్రయోగశాలలు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సహకారంతో ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. సాల్వో లాంచ్ పరీక్ష విజయంతో క్షిపణి వ్యవస్థ విశ్వసనీయత మరోసారి నిరూపితమైందని తెలిపారు. డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ, త్వరలోనే ‘ప్రళయ్’ క్షిపణిని భారత సాయుధ దళాల్లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: