2025 క్యాలెండర్ ఇయర్‌కు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ఘనంగా వీడ్కోలు పలికాయి. ఏడాది చివరి ట్రేడింగ్ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. ఐటీ రంగంలో స్వల్ప బలహీనత కనిపించినప్పటికీ, మిగతా అన్ని ప్రధాన రంగాల్లో ఇన్వెస్టర్ల ఆసక్తి స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో మార్కెట్ మొత్తం సానుకూల వాతావరణంలో ముగిసింది.
Read also: Gold Rate Today : హైదరాబాద్ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Stock Market
ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ (sensex) 545.52 పాయింట్లు పెరిగి 85,220.6 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 190.75 పాయింట్లు లాభపడి 26,129.6 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ వరుసగా పదో ఏడాది కూడా లాభాలతో ముగిసిన సూచీగా నిలిచింది. 2025 మొత్తం మీద నిఫ్టీ 10.5 శాతం, సెన్సెక్స్ 9.06 శాతం వార్షిక రాబడిని నమోదు చేయడం ఇన్వెస్టర్లకు విశేషంగా మారింది.
రంగాల పరంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ రంగం ముందుండి మార్కెట్ ర్యాలీకి నాయకత్వం వహించింది. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సూచీ లాభాల్లో కొనసాగగా, స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం నష్టాల్లో నిలిచింది. నిఫ్టీ 26,000 మార్క్ పైన నిలకడగా కొనసాగడం మార్కెట్‌కు సానుకూల సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: