2026 సంవత్సరానికి న్యూజిలాండ్ స్వాగతం పలికింది. (New Zealand) ఆనందోత్సాహాల మధ్య న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని(New Year) ఆహ్వానించారు. అక్కడి స్థానిక సమయం ప్రకారం గడియారం ముల్లు 12 దాటగానే.. ఆక్లాండ్ నడిబొడ్డున ఉన్న న్యూజిలాండ్ ఎత్తైన కట్టడం ‘స్కై టవర్’ బాణసంచా వెలుగులతో మెరిసిపోయింది. సుమారు 5 నిమిషాల పాటు సాగిన ఈ కనువిందులో 3,500 రకాల బాణసంచాను స్కై టవర్ అంతస్తుల నుంచి కాల్చారు. అయితే, అక్కడి వాతావరణం వేడుకలకు కాస్త ఆటంకం కలిగించింది. భారీ వర్షం, ఉరుముల సూచన ఉండటంతో న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లోని పలు చిన్న కమ్యూనిటీ ఈవెంట్లను రద్దు చేశారు. అయినా ప్రధాన వేడుకలు మాత్రం వర్షంలోనే కొనసాగాయి. (New Zealand) ఆక్లాండ్ కంటే ముందే, పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల దేశమైన ‘కిరిబాటి’ లోని ఓ అటోల్ (కిరితిమతి దీవి) ప్రపంచంలోనే తొలిసారిగా 2026లోకి అడుగుపెట్టింది.
Read Also: Jairam Ramesh: భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: