ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తమిళనాడు మరియు పుదుచ్చేరిని కలుపుతూ కొత్త ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని కోస్టల్ ఛార్మ్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీగా డిజైన్ చేశారు. ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, మహాబలిపురం (Mahabalipuram) వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?
ఈ ప్రత్యేక యాత్రా ప్యాకేజీ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు వ్యవధి కలిగి ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుండి రైలు బయలుదేరుతుంది. రైలు ప్రయాణంలో మొదటి పూట భోజనం (బ్రేక్‌ఫాస్ట్) IRCTC అందిస్తుంది, మిగిలిన భోజనాలను ప్రయాణికులు స్వయంగా నిర్వహించాలి.

ధరల వివరాలు:
ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికుల కోసం, కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో డబుల్ షేరింగ్ ధర ₹19,810, ట్రిపుల్ షేరింగ్ ₹15,290గా ఉంది. 5–11 ఏళ్ళ పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹17,660, ట్రిపుల్ షేరింగ్ ₹13,130, పిల్లలకు బెడ్ తో ₹9,470, బెడ్ లేకుండా ₹6,670 ధరలు ఉన్నాయి. నలుగురు నుంచి ఆరుమంది ప్రయాణికుల కోసం కంఫర్ట్ (3ఏ) డబుల్ షేరింగ్ ₹16,140, ట్రిపుల్ షేరింగ్ ₹13,790, పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹13,990, ట్రిపుల్ షేరింగ్ ₹11,630, పిల్లలకు బెడ్ తో ₹8,830, బెడ్ లేకుండా ₹6,670 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు తమిళనాడు తీరంలోని అందాలను, పుదుచ్చేరి శాంతమైన వాతావరణాన్ని సొంతుగా ఆస్వాదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: