వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లి భార్యను కోల్పోయిన భర్త
అన్నమయ్య(Annamayya) జిల్లా ఓబులవారిపల్లె(Obulavaripalle Accident) మండలం మంగంపేట గ్రామానికి చెందిన దంపతుల జీవితంలో విషాదం మిగిల్చిన ప్రమాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దైవ దర్శనం కోసం మంగళవారం తెల్లవారుజామునే బైక్‌పై బయలుదేరారు పోతులయ్య, లక్ష్మీదేవి దంపతులు.
Read Also: Mahabubnagar: మైనర్ల ప్రేమ గర్భం దాల్చిన బాలిక

బైక్ అదుపుతప్పి లారీ ఢీ..
శెట్టిగుంట ప్రాంతానికి చేరుకున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రహదారిపై దట్టమైన పొగమంచు(Dense fog) కమ్ముకోవడంతో ఎదురుగా దారి స్పష్టంగా కనిపించలేదు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను గమనించలేక బైక్ అదుపుతప్పింది. వెనుక కూర్చున్న లక్ష్మీదేవి రోడ్డుపై పడిపోవడంతో అక్కడే ప్రమాదం తీవ్రతరం అయింది.
దైవ దర్శనం ఆనందం మటాష్.
ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పిన మహిళపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మీదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో పోతులయ్య తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కసారిగా పండుగ ఆనందం విషాదంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: