ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జనవరి 4న తొలి టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ కానుందని నిర్మాణ సంస్థ GMR ప్రకటించింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి విమానంలో రానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్‌వే, ఏటీసీ, టెర్మినల్ భవనాలు తుది దశలో ఉన్నాయి. 2026 మే నుంచి ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Read Also: AP: స్క్రబ్ టైఫస్ విజృంభణ.. 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు

సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చొరవతో విజయనగరంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో ఫైనల్ టెస్ట్ రన్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు అధికారులు. ఇప్పటికే దాదా 95శాతం నిర్మాణ పనులు పూర్తికాగా మరో 5శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిని కూడా వచ్చే ఏడాది జూన్ లోపు పూర్తి చేసి..
ఆగస్ట్‌లో ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారు.అయితే జనవరి 4వ తేదీన ఎయిర్‌పోర్టులో చివరి ట్రయల్‌రన్ పూర్తి చేసిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఇక ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు ఏపీ పర్యాటకం కూడా ఊపందుకోనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: