నటి, ఏపీ మాజీ మంత్రి రోజా తన కూతురు అన్షు (Anshu) భవిష్యత్తు గురించి స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రోజా, అన్షు కెరీర్‌పై వస్తున్న పలు ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తన కూతురు అన్షు (Anshu) కు నటి అవ్వాలనే కోరిక లేదన్నారు. సైంటిస్ట్ అవ్వాలనుకుంటుందని, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించిందన్నారు. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో రోజా తెలిపారు. స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ‘ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటా’ అని నవ్వుతూ రోజా సమాధానమిచ్చారు.
Read Also: Salman Khan: సినిమా పై చైనా విమర్శలు.. భారత్ ఘాటు జవాబు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: